శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 08, 2020 , 03:39:05

ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు

ప్రభుత్వ ఉపాధ్యాయులకు  గుర్తింపు కార్డులు

  • n యూ-డైస్‌ వివరాలతో జారీకి సిద్ధం
  • n 25లోగా టీచర్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌లో నమోదుకు ఆదేశాలు
  • n నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో  12,237 మంది టీచర్స్‌
  • n అత్యంత ప్రాధాన్యత అంశంగా భావించాలని డీఈఓలకు సూచన

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ సర్కార్‌.. మరో అడుగు ముందుకు వేసి వివిధ యాజమన్యాల పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం -పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆదేశాలతో ఈ నెల 25లోగా వారంతా తమ పూర్తి వివరాలను ‘టీచర్స్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌'లో నమోదు చేయాల్సి ఉంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 12,237 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 


- నల్లగొండ విద్యావిభాగం 

   వివిధ ప్రభుత్వ పాఠశాలలో(ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ, కస్తూర్బా, యూఆర్‌ఎస్‌, టీఆర్‌ఈఐఎస్‌) పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డుల జారీకి పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 2019-20 విద్యా సంవత్సరంలో U-DISE (Unified District Information System for Education) ప్రకారం అందించే కార్డులకు వారి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంది.

ఉపాధ్యాయులు నమోదు చేయాల్సినవి ఇవే...

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు(జడ్పీ, ఎంపీపీఎస్‌), కస్తూర్బా, ఆదర్శ, అర్బన్‌ రెసిడెన్షియల్‌, టీఆర్‌ఈఐఎస్‌(తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ)లో పనిచేసే ఉపాధ్యాయులందరికీ గుర్తింపు కార్డులు ప్రభుత్వం -పాఠశాల విద్యాశాఖ అందిస్తుంది. ఆయా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులంతా https://schooledu.telangana.gov.in/ISMS వెబ్‌సైట్‌లో వ్యక్తిగత వివరాలు, బ్లడ్‌ గ్రూప్‌(రక్తవర్గం), నివాస చిరునామా నమోదు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎవరైనా ఉపాధ్యాయులు తమ వివరాలను మార్పులు(నవీకరణ) చేసుకోవాలంటే సరిచూసుకుని ఆ తర్వాతనే చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. 

నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 12,237మంది ఉపాధ్యాయులు 

నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 2019-20 యూ-డైస్‌ ఆధారంగా 12, 237మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా తమ వివరాలు ఈ నెల 25లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా మండలలోని ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధతో నిర్ణీత గడువులో వీటిని పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. 

వెబ్‌సైట్‌లో వివరాల నమోదు ఇలా చేసుకోవాలి..

l తొలుత https://schooledu.telangana.gov.in/ISMSలో ప్రవేశించాలి

l రెండో దశలో ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ మెనూ క్లిక్‌ చేయాలి

l మూడో దశలో టీచర్‌ ఐడీ కార్డు ఇన్ఫోను క్లిక్‌ చేయాలి..కొత్త 

వెబ్‌ పేజీలోకి తీసుకెళ్తుంది. 

l నాల్లో దశలో మీ మొబైల్‌ నెంబర్‌, ట్రెజరీ ఐడీని నమోదు చేయాలి. మీ మొబైల్‌ నెంబర్‌కు ఒక వన్‌ టైం పాస్‌వర్డ్‌ వస్తుంది.

l ఐదో దశలో మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.

l ఆరో దశలో గుర్తింపు కార్డులో అచ్చువేయాల్సిన వివరాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకుని ఏవైనా లోపాలుంటే సరిచేసి నమోదు చేయాలి. అన్నీ సరిచేసిన తర్వాత సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. దీంతో వివరాల నమోదు పూర్తవుతుంది.

నిచేస్తున్న ఉపాధ్యాయులు ఇలా...

మేనేజ్‌మెంట్‌ నల్లగొండ జిల్లా సూర్యాపేట జిల్లా మొత్తం 

ప్రభుత్వ పాఠశాలలు 448    139    587

ఎంపీపీ  జడ్పీ పాఠశాలలు 6047      3623      9670

కస్తూర్బా (కేజీబీవీ)    294      187      481

మోడల్‌ స్కూళ్లు(ఆదర్శ)  331      143    474     

ఎయిడెడ్‌          300      53    353

అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు 06      06      12

టీఎస్‌ఆర్‌ఈఐ సొసైటీ స్కూళ్లు 647        13      660

                                                          8.073      4,164    12,237

25లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి 


తెలంగాణ ప్రభుత్వం-పాఠశాల విద్యాశాఖ సమగ్రశిక్ష ఆదేశాల మేరకు యూ-డైస్‌ -2019-20 వివరాల ప్రకారం వివిధ యాజమాన్యాల ప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డుల ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలను జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు(జడ్పీ, ఎంపీపీఎస్‌), కస్తూర్బా, ఆదర్శ, అర్బన్‌ రెసిడెన్షియల్‌, టీఆర్‌ఈఐఎస్‌ ఉపాధ్యాయులంతా ఈ నెల 25లోగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఎంఈఓలు ఉపాధ్యాయులందరూ నమోదు చేసే విధంగా చూడాలి.

- బి.భిక్షపతి, డీఈఓ నల్లగొండ.

గుర్తింపు కార్డుల ఇవ్వడం హర్షణీయం


ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే ప్రభుత్వ, పాఠశాల విద్యాశాఖ ఆలోచన హర్షణీయం. ఏదైనా సందర్భాలలో ఐడీ కార్డు అవరమనుకుంటే పాఠశాల హెచ్‌ఎం లేదా ఎంఈఓలతో తయారు చేసుకుని తీసుకుంటున్నాం. కానీ అలాంటి ఇబ్బంది లేకుండానే నేరుగా ప్రభుత్వమే అందజేస్తుండడం శుభపరిణామం. అంతే కాకుండా ఆ గుర్తింపు కార్డును మెడలో వేసుకుని పాఠశాలకు వెళ్తుంటే సమాజంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వీరు అనే భావన కలుగుతుంది. 

- ఎండీ సాదఖ్‌, ఉపాధ్యాయుడు, ఎంపీపీఎస్‌ పలివెల-మునుగోడు(మం)- నల్లగొండ జిల్లా


logo