మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 07, 2020 , 01:56:53

కొవిడ్‌ టెస్టుల పేరుతో ఆర్‌ఎంపీ దందా

కొవిడ్‌ టెస్టుల పేరుతో ఆర్‌ఎంపీ దందా

  • l   బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు 

హుజూర్‌నగర్‌/ హుజూర్‌నగర్‌ రూరల్‌ : జ్వరంతో  ఓ మహిళకు కరోనా సోకిందని,  పరీక్షల పేరుతో ఓ ఆర్‌ఎంపీ రూ.6వేలు వసూలు చేశాడు. అనంతరం పభుత్వ దవాఖానకు పోవాలని సూచించగా.. బాధిత కుటుంబ సభ్యులు నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ రాజా తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా  20 ఏండ్ల క్రితం వలస వచ్చిన పొలిశెట్టి దశరథ కుటుంబం

హుజూర్‌నగర్‌ పట్టణం శ్రామికనగర్‌లో నివాసముంటుంది. కాగా, దశరథ  ఇందు ఐదు  నుంచి జ్వరంతో బాధపడుతుంది.  స్థానిక ఆర్‌ఎంపీ గుంటి యాదగిరి వద్దకు చికిత్స కోసం వెళ్లగా.. అతను అను ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి కరోనా వ్యాధి సోకిందని  పూర్తిగా నయం చేయిస్తానని నమ్మబలికి రూ.6వేలు తీసుకున్నాడు. అనంతరం సాధారణ జ్వరం రిపోర్టు  ప్రభుత్వ ఏరియా దవాఖానలో చికిత్స చేయించుకోవాలని సూచించాడు. దీంతో తమ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావని బాధిత కుటుంబ సభ్యులు నిలదీయగా..  పరీక్షల కోసం రూ.1500 ఇచ్చానన్నాడు.  కుటుంబ సభ్యులు స్థానిక కౌన్సిలర్‌ సహాయంతో ఆర్‌ఎంపీని నిలదీసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెల్లడించారు. ఈ విషయంలో ల్యాబ్‌వారు కూడా ఆర్‌ఎంపీకి సహకరించారని, ఇద్దరూ కలిసి తమను మోసం చేశారని దశరథ పేర్కొన్నాడు.   


logo