గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Aug 06, 2020 , 00:49:39

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

సూర్యాపేటటౌన్‌ : లింగనిర్ధ్దారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి వివిధ మండలాల వైద్య, ఐసీడీఎస్‌  అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో 1000 మంది అ బ్బాయిలకు 935 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని, ఇలాగే కొనసాగితే మాన వ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదముందన్నారు. సైన్స్‌ ఇంతగా పెరుగుతున్న సమయంలో కూడా అబ్బాయే కావాలని చూడడం ముర్ఖత్వమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే స్కానింగ్‌ సెంటర్లను సీజ్‌ చేయాలన్నారు. ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్‌ సిబ్బంది గర్భిణులు మొదటి ప్రసవం నుంచే పర్యవేక్షించాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నల్లగొండ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి ఎం.వీ.రమేశ్‌ మాట్లాడుతూ అమ్మాయిలు అన్నిరంగాల్లో అబ్బాయిలతో సమానంగా పోటీ పడుతున్నారని, ఈ రోజుల్లో ఆడ పిల్లలపై వివక్ష చూపడం అమానుషమన్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ మాట్లాడుతూ   ఎవరైనా లింగ నిర్ధ్దారణ పరీక్షలు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామ న్నారు.  కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.హర్షవర్ధన్‌, ఎన్‌జీఓ ఇరుగు కోటేశ్వరి, డెమో తిరుపతిరెడ్డి ఉన్నారు. logo