ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 05, 2020 , 01:06:47

ఏండ్ల నాటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

ఏండ్ల నాటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

సూర్యాపేట రూరల్‌ : ఎంతోకాలంగా నెలకొన్న సమస్యకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరిష్కారం చూపారు.  మున్సిపాలిటీ   వార్డు పిల్లలమర్రి  నుంచి డీ-14 చైనేజ్‌ తూము కాల్వ గ్రామంలోని నివాసాల మధ్య నుంచి వెళ్తుంది. ఆ కాల్వ పిల్లలమర్రి - పిన్నాయిపాలెం గ్రామాల మీదుగా మూసీ కాల్వ కింది నుంచి పైపులైన్‌ ద్వారా పోయే విధంగా ఇంజినీరింగ్‌ శాఖ అప్పట్లో డిజైన్‌ చేసింది.  పైపులైన్‌ పూర్తిగా పూడిపోవడంతో అటు మూసీ,  మురుగు  సుమారు 200కు పైగా జనావాసాలు ముంపునకు గురయ్యాయి. అప్పట్లో గ్రామపంచాయతీగా ఉన్న ఈ గ్రామంలోని పరిస్థితి తీవ్రతను గుర్తించిన మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.10లక్షలతో ఎత్తు పెంచారు. కానీ.. పైపులైన్‌ పూడిపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు  మళ్లీ జనావాసాల మధ్యకు వచ్చింది. దీంతో  మంగళవారం ఉదయం మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. మంత్రి వెంటనే  గ్రామానికి వెళ్లి పూడిపోయిన డీ-14 చైనేజ్‌ తూము కాల్వను పరిశీలించారు. కాల్వ మరమ్మతుల కోసం అప్పటికప్పుడు రూ.7లక్షలు  చేశారు. పనులు  చేపట్టి రెండ్రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, కమిషనర్‌ రామానుజులరెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్‌ బచ్చలకూరి శ్రీను, టీఆర్‌ఎస్‌ నాయకులు రాపర్తి సైదులు, శ్రీను, మహేశ్‌, వల్లాల సైదులుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. logo