ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 05, 2020 , 01:02:48

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నడిగూడెం : రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు రత్నవరం, సిరిపురం, కరివిరాల గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికలు ఉపయోగపడనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని, అందుకే వారి  సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దసరా నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ వాసు, ఎంపీపీ యాతాకుల జ్యోతి, జడ్పీటీసీ బాణాల కవిత, తాసిల్దార్‌ దేవకరుణ, ఎంపీడీఓ శాంతకుమారి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కాసాని వెంకటేశ్వర్లు, సర్పంచులు గడ్డం నాగలక్ష్మి, పగడాల పద్మ, లక్ష్మీవీణ, నీలిమాగాంధీ, ఏఓ రాజగోపాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొల్లు రామారావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

అనంతగిరి : రైతుల మేలు కోసమే రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ పేర్కొన్నారు. మండలంలోని త్రిపురవరంలో రైతు వేదిక నిర్మాణ పనులకు  మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు.  ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్‌రావు, జడ్పీటీసీ కొణతం ఉమాశ్రీనివాసరెడ్డి, తాసిల్దార్‌ వాజిద్‌, ఎంపీడీఓ సుగుణకుమార్‌, ఏడీఏ వాసు, ఏఓ సతీశ్‌, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఈదుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

మోతె : రైతుల సంక్షేమానికే ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని మామిళ్లగూడెం, రావిపహాడ్‌, మోతె, నామవరం గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.  అనంతరం రావిపహాడ్‌లో తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు.  రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్‌, ఎంపీపీ ముప్పాని ఆశాశ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, వైస్‌ఎంపీపీ మైనంపాటి సునీతామల్లారెడ్డి, తాసిల్దార్‌ వెంకన్న, ఎంపీడీఓ శంకర్‌రెడ్డి, ఏఓ అరుణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శీలం సైదులు, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ గురువారెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.  

ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం   

కోదాడటౌన్‌ : ఆడబిడ్డలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో కోదాడ మున్సిపాలిటీలోని 26,27,9వార్డులకు చెందిన 24మంది లబ్ధిదారులకు షాదీముబారక్‌ చెక్కులను అందజేసి మాట్లాడారు.  ఎంపీపీ చింతా కవితారెడ్డి, కౌన్సిలర్లు షాబుద్దీన్‌, వహీదా ఖాజామొహినొద్దీన్‌, మదార్‌, తాసిల్దార్‌ మహమూద్‌ అలీ, ఆర్‌ఐ కళ్యాణి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్‌రావు, తుమ్మలపల్లి భాస్కర్‌రావు పాల్గొన్నారు.logo