మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 05, 2020 , 00:41:26

రైతువేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలి

రైతువేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలి

నీలగిరి/ సూర్యాపేట : రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లను కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. వీధి వ్యాపారుల రుణం, స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోనల్‌, వ్యవసాయ గోదాంల నిర్మాణం, రెవెన్యూ రికార్డులపై సమీక్షించారు. ఈ సమావేశంలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు వినయ్‌కృష్ణారెడ్డి, ప్రశాంత్‌ జీవన పాటిల్‌ పాల్గొన్నారు.


logo