బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 04, 2020 , 09:24:27

మొక్కలను పరిశీలించిన కలెక్టర్‌

మొక్కలను పరిశీలించిన కలెక్టర్‌

రహదారి వెంట మరో వెయ్యి మొక్కలు నాటాలని ఆదేశం

చిట్యాల : మున్సిపాలిటీ పరిధిలో నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సోమవారం పరిశీలించారు. వట్టిమర్తి శివారులోని జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలను పరిశీలించి మరో వెయ్యి మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చిట్యాల కూరగాయల మార్కెట్‌, స్మృతివనాన్ని సందర్శించి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. చిట్యాల పట్టణంలో కలెక్టర్‌  మొక్కను నాటారు. ఇప్పటి వరకు నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి మున్సిపాలిటీ పరిధిలో హరితహారం, పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ట్రైనీ ఐఏఎస్‌ ప్రతిమా సింగ్‌, కమిషనర్‌ అయిత ప్రభాకర్‌, ఎంపీడీఓ లాజర్‌, తాసిల్దార్‌ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


logo