సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 03, 2020 , 08:00:39

నేటి నుంచి ఆగస్టు 31వరకు ‘పేట’లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

నేటి నుంచి ఆగస్టు 31వరకు  ‘పేట’లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

బొడ్రాయిబజార్‌ :  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా దుకాణాలు ఈ నెల 3నుంచి 31వ తేదీ వరకు  స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ చేపడుతున్నట్లు సూర్యాపేట కిరాణా ఫ్యాన్సీ జనరల్‌ మార్చంట్‌ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక  అసోసియేషన్‌ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోరా వైరస్‌ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు.  కార్యక్రమంలో వాసా శ్రీశైలం, వెన్నెల రామచంద్రారెడ్డి, పలు కిరాణాదుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు. 


logo