శనివారం 08 ఆగస్టు 2020
Suryapet - Aug 02, 2020 , 02:03:55

నల్లబెల్లం తరలిస్తున్న నలుగురు అరెస్టు

నల్లబెల్లం తరలిస్తున్న నలుగురు అరెస్టు

  • 1,200 కిలోల బెల్లం, 150 కిలోల పటిక, వాహనం స్వాధీనం

కోదాడ రూరల్‌ : ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు  నల్లబెల్లం తరలిస్తున్న నలుగురిని  పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎక్సైజ్‌ సీఐ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర రాష్ట్రం గుంటూరు పట్టణం నుంచి ఖమ్మం జిల్లా కొరివికి (ఏపీ07 టీహెచ్‌ 7628) వాహనంలో 1,200 కిలోల నల్లబెల్లం, 150 కిలోల పటిక తరలిస్తున్నారు.  సమాచారం మేరకు కోదాడ మండలం నల్లబండగూడెం శివారులోని సరిహద్దు ప్రాంతం రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద వాహన తనిఖీలో పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వాహనాన్ని  చేసుకున్నట్లు సీఐ తెలిపారు.


logo