శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 01, 2020 , 01:12:26

సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు : ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌

సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు  : ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌

 సూర్యాపేటసిటీ : కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బక్రీద్‌ రోజున ఈద్గాల వద్ద సామూహికంగా ప్రార్థ్ధనలకు అనుమతి లేదని  సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి వీలుగా అందరూ తమ తమ ఇండ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని కోరారు. కరోనా కట్టడికి ప్రజలంతా పోలీసుశాఖతో   సహకరించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో మత పెద్దలకు సైతం కరోనా విజృంభిస్తున్న పరిస్థితులను వివరిస్తున్నామని పేర్కొన్నారు.  బక్రీద్‌ పర్వదినాన్ని ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు. logo