సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 01, 2020 , 01:03:26

ఉర్లుగొండలో గుప్త నిధుల కోసం తవ్వకాలు..!

 ఉర్లుగొండలో గుప్త నిధుల కోసం తవ్వకాలు..!

  • భారీగా బంగారం దొరికిందని గుసగుసలు
  • విచారిస్తున్న పోలీసులు

మోతె : మండల పరిధిలోని ఉర్లుగొండ  లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం గుట్ట సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాల్లో గుప్త నిధులు ఉన్నాయని  కొందరు రైతులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో  బంగారం దొరికిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.  బంగారాన్ని బయటకు తీయడానికి దున్నపోతును కూడా బలి ఇచ్చినట్లు సమాచారం. కాగా గుట్ట వెంట ఉన్న రైతులను విచారించడంతో రాళ్లు తీసేందుకు గుంతలు తీసినట్లు తెలిపారు.  ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం. విషయంపై మోతె ఎస్‌ఐ గోవర్ధన్‌ వివరణ కోరగా  పొలాల్లో రాళ్లు తీసేందుకు గుంతలు తీసినట్లు రైతులు పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని వెల్లడించారు.


logo