సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 29, 2020 , 02:53:44

వలిగొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కునపురి కవిత

వలిగొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కునపురి కవిత

వలిగొండ: వలిగొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కునపురి కవితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు డేగల పాండరి మంగళవారం విలేకర్లకు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల పత్రాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కవితకు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తనకు మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిదని, తన నియామకానికి సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర, జిల్లా, మండల టీఆర్‌ఎస్‌ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ఈనెల 31 శుక్రవారం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం చేయనుంది. 

పాలక మండలి సభ్యులు వీరే.. 

చైర్‌పర్సన్‌ కునపూరి కవితారాములు(దాసిరెడ్డిగూడెం, వలిగొండ) వైస్‌ చైర్మన్‌ కన్నెబోయిన అయిలయ్య(ఇస్కిళ్ల, రామన్నపేట), ముదిరెడ్డి సంజీవరెడ్డి(గొల్నెపల్లి), పోలేపాక సత్యనారాయణ(వలిగొండ), ఎలిమినేటి సత్యనారాయణ(ఎం.తుర్కపల్లి), నాగెల్లి కృష్ణమూర్తి(పులిగిల్ల), గౌరిశెట్టి అశోక్‌(వలిగొండ), గర్ధాసు కర్ణాకర్‌(ఇంద్రపాల నగరం), ఆవనగంటి నర్సింహ(పల్లివాడ), మస్కు సుదర్శన్‌(ఎన్నారం), రామన్నపేట సర్పంచ్‌ గొశిక శిరీష, వలిగొండ పీఏసీఎస్‌ చైర్మన్‌ సుర్కంటి వెంకట్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారితో కూడిన పాలకమండలి ఒక సంవత్సరంపాటు కొనసాగుతుంది.


logo