శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 28, 2020 , 04:44:54

సూర్యాపేట, దేవరకొండకు కొత్త ఆర్డీఓలు

 సూర్యాపేట, దేవరకొండకు కొత్త ఆర్డీఓలు

  • l  రాజేంద్రకుమార్‌, గోపీరామ్‌ నియామకం

సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీఓ మోహన్‌రావు  బదిలీ అయ్యారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా   ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర రెవెన్యూ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సూర్యాపేట ఆర్డీఓగా కె. రాజేంద్రకుమార్‌ను నియమించింది. ప్రస్తుతం రాజేంద్రకుమార్‌కు  రెవెన్యూ శాఖ లో ఎలాంటి పోస్టింగ్‌లో లేరు. మూడేళ్లుగా సూర్యాపేట ఆర్డీఓగా విధులు నిర్వహించిన మోహన్‌రావు సూర్యాపేట నియోజకవర్గ ఎన్నికల అధికారిగా శానససభ, పార్లమెంట్‌, పంచాయతీ, జడ్పీ, మండల ప్రజాపరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. కొద్ది రోజులుగా సూర్యాపేట డీఆర్వోగా అదనపు బాధ్యతలను సైతం నిర్వహిస్తున్నారు. 

దేవరకొండ ఆర్డీఓగా కె. గోపీరామ్‌

చందంపేట(దేవరకొండ): దేవరకొండ ఆర్డీఓగా కె. గోపీరామ్‌ నియామకమయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన ఆర్డీఓ లింగ్యానాయక్‌ బదిలీ కావడంతో బోధన్‌ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న గోపీరామ్‌ దేవరకొండ ఆర్డీఓగా నియామకమయ్యారు. లింగ్యానాయక్‌ నాలుగు సంవత్సరాలుగా సమర్థ్ధంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన్ను హైదరాబాద్‌ రెవెన్యూ శాఖకు రిపోర్టు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.  


logo