సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 27, 2020 , 00:07:28

మట్టపల్లి నిర్మానుష్యం

 మట్టపల్లి నిర్మానుష్యం

  • ఏకాంతంలోనే స్వామివారికి నిత్య కైంకర్యాలు

మఠంపల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలుపుదల చేశారు. కరోనా వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో దేవాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఆలయాధికారులు ఈనిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు తెలిపారు. దీంతో మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహుని ఆలయంలో కేశఖండనాలు, అన్నదానం, ప్రసాద విక్రయ కేంద్రాలు, టోల్‌గేట్‌ ఇలా అన్ని విభాగాలను మూసివేశారు. ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలుపుదల చేస్తున్నట్లు తెలియజేసే ఫ్లెక్సీలను క్షేత్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. భక్తుల లేమితో ఆలయ పరిసరాలు కళతప్పాయి. నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఏకాంతంలోనే నిత్య కైంకర్యాలు, నివేదనలు ఆగమానుసారం జరిపారు.

భక్తులకు తప్పని  తిప్పలు..

శ్రీ వారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉదయాన్నే క్షేత్రానికి విచ్చేశారు. ఆలయ సిబ్బంది వారి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో చేసేదేంలేక అక్కడి నుంచి భక్తులు వెనుదిరిగారు.


logo