శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 25, 2020 , 01:47:45

నాయకత్వంపై గట్టి పట్టు బిగించారు

నాయకత్వంపై గట్టి పట్టు బిగించారు

ఉద్యమ అనుభవంతో అనతి కాలంలోనే నాయకత్వంపై గట్టిపట్టు సాధించిన యువనేతగా..  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడిగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రికార్డు సృష్టించారని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లాకేంద్రంలోని బాలభవన్‌లో మొక్కలు నాటారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన్మదిన వేడుకలు హోరెత్తాయి. టీఆర్‌ఎస్‌ శ్రేణులు కేక్‌ కట్‌ చేయడంతో పాటు వేలాదిగా మొక్కలు నాటి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

సూర్యాపేట టౌన్‌ : ఉద్యమఅనుభవంతో అనతి కాలంలోనే నాయకత్వంపై గటి ్టపట్టు సాధించిన యువనేతగా.. తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడుగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రికార్డు సృష్టించారని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ జన్మదినం పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాకేంద్రంలోని బాలభవన్‌లో మొక్కలు నాటారు.   మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మొక్కలు నాటి  మాట్లాడారు. అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టిన ఘనతను మంత్రి కేటీఆర్‌ సొంతం చేసుకున్నారన్నారు. జాతి గర్వించే స్థాయిలో నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న మంత్రి కేటీఆర్‌ రాష్ర్టానికి భవిష్యత్‌ ఆశాకిరణం అనిఅభివర్ణించారు.  జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ్ధ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు తాహెర్‌పాషా, బత్తుల జానీ, కుంభం రాజేందర్‌, కీసర వేణుగోపాల్‌ రెడ్డి, బాల కేంద్రం సూపరింటెండెంట్‌ రాధాకృష్ణారెడ్డి, సిబ్బంది వీరూనాయుడు, సత్యం, సత్యనారాయణ సింగ్‌, ఉమారాణి, సంధ్య, అనూష   పాల్గొన్నారు.   logo