శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 24, 2020 , 01:06:56

అటవీ భూముల్లో తవ్వకాలు

అటవీ భూముల్లో తవ్వకాలు

  •  నలుగురిపై కేసు.. 4 జేసీబీలు  

నందికొండ/ తిరుమలగిరి (సాగర్‌) : అటవీ  అన్యాక్రాంతం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి  జేసీబీలను స్వాధీనం చేసుకున్నట్ల్లు ఫారెస్ట్‌ రేంజర్‌ రామేశ్వర్‌రెడ్డి తెలిపారు. హిల్‌కాలనీ ఫారెస్ట్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.  (సాగర్‌) మండలం గాత్‌తండాకు చెందిన మేగావత్‌ రామాంజనేయులు,  బాష్యా, రంగుండ్లకు చెందిన ధరావత్‌ హిమ  సమీపంలో అటవీ భూములను జేసీబీలతో చదును చేస్తున్నారు.  తెలుసుకున్న ఫారెస్టు అధికారులు  దాడులు చేసి మూడు జేసీబీలను  చేశారు.  కేసు నమోదు చేశారు. అదేవిధంగా నేరెడుగొమ్ము మండల కేంద్రంలో  ఫారెస్ట్‌ భూములను ఆక్రమించడానికి యత్నించాడు. ఫారెస్టు సిబ్బంది దాడి చేసి ఒక జేసీబీని సీజ్‌ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అడవులను ఆక్రమించి తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదని,  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  సెక్షన్‌ అధికారులు అశోక్‌రెడ్డి, మానస, బీట్‌ అధికారులు రవీందర్‌రెడ్డి, వెంకన్న, విక్రం, సిబ్బంది పాల్గొన్నారు.



logo