గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 24, 2020 , 01:03:54

వ్యాయామ అధ్యాపకుడికి ఘన స్వాగతం

వ్యాయామ అధ్యాపకుడికి ఘన స్వాగతం

  • హరితహారం, కరోనాపై  చైతన్య యాత్ర చేపట్టిన  మల్లికార్జున్‌

నల్లగొండ విద్యావిభాగం: కరోనా, హరితహారంపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడానికి హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రభుత్వ వ్యాయామ విద్య ఉపాధ్యాయ కళాశాల అధ్యాపకుడు మల్లికార్జున్‌ చైతన్య యాత్ర చేపట్టాడు. ఈ యాత్ర గురువారం నల్లగొండకు చేరింది. ఈ సందర్భంగా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోనగాని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈనెల 10న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా హైదరాబాద్‌లో తన పర్యటనను ప్రారంభించినట్లు తెలిపారు. అక్కడి నుంచి 25 జిల్లాల్లో పర్యటిస్తూ నల్లగొండకు వచ్చినట్లు వెల్లడించారు. ఉదయం ఎన్‌జీ కళాశాల వద్ద ఘన స్వాగతం పలికి వాకింగ్‌కు వచ్చే వారికి అవగాహన కల్పించి యోగా సాధన చేయించినట్లు తెలిపారు. అనంతరం మల్లికార్జున్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రయ్య, ఉపాధ్యాయులు రవీందర్‌, శంభులింగం, శ్రీనివాస్‌, గిరిబాబు, పుల్లయ్య  ఉన్నారు. 


logo