మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 24, 2020 , 00:45:13

నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి : మంత్రి

నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి : మంత్రి

సూర్యాపేట : జాతీయ రహదారి వెంట నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని, అందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని శాంతినగర్‌ సమీపంలోని 65వ జాతీయ రహదారి వెంట మొక్కలు లేని చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని ప్రారంభించారని,

రహదారి వెంట మూడు వరుసల్లో మొక్కలు నాటాలని సూచించారని పేర్కొన్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు జిల్లా పరిధిలోని 65కిలోమీటర్ల మేర గల జాతీయ రహదారి వెంట 51వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, వాటిని వెంటనే నాటాలన్నారు. నాటిన చోట మొక్కలు చనిపోతే వెంటనే కొత్త మొక్కలు నాటాలని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం ఉండాలన్నారు.  కార్యక్రమంలో ఎంపీ  బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ జానయ్యయాదవ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటనారాయణగౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ రజాక్‌, డీఎఫ్‌ఓ ముకుందారెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.  


logo