శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 23, 2020 , 04:57:33

రైతువేదికల నిర్మాణ పనులు ప్రారంభం

రైతువేదికల నిర్మాణ పనులు ప్రారంభం

మాడ్గులపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు వేదికలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మోసీన్‌ అలీ అన్నారు. మండలంలోని చిరుమర్తి గ్రామంలో రైతువేదిక భవన నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పాలుట్ల బాబ య్య, సర్పంచ్‌ నాంపల్లి శ్రీశైలం, పోకల రాజు, ఏడీఏ నాగమణి, ఎఓ సైదానాయక్‌, వెంకటాచారి పాల్గొన్నారు. 

డిండి :  మండల కేంద్రంలో రైతువేదిక నిర్మాణానికి బుధవారం సర్పంచ్‌ మేకల సాయమ్మ భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓ పరమేశ్వరి, ఎంపీటీసీలు వెంకటయ్య, రాధిక, కాశన్న, శ్రీనివాస్‌గౌడ్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చందంపేట : కంబాలపల్లి గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, పీఆర్‌ ఏఈ రాజు, సర్పంచ్‌ ముత్యాల రాములమ్మ, ఎంపీటీసీ చంద్రశేఖర్‌, మల్లేశ్‌యాదవ్‌, వెంకటయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.  

పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని ఘణపురంలో రైతు వేదిక నిర్మాణ పనులను ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వల్లభరెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఎంఈఓ రాములు, సర్పంచ్‌ పావని, ఎంపీటీసీ సంధ్య పాల్గొన్నారు.  logo