మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 23, 2020 , 02:58:34

‘పేట’ మున్సిపాలిటీలో నాలుగు పదవులు

‘పేట’ మున్సిపాలిటీలో నాలుగు పదవులు

  • కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు దరఖాస్తుల స్వీకరణ షురూ 

బొడ్రాయిబజార్‌ : సూర్యాపేట మున్సిపాలిటీలో నాలుగు కో-ఆప్షన్‌ సభ్యుల పదవులకు దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైంది. ఈ  నెల 28వరకు దరఖాస్తులు స్వీరించనుండగా తొలిరోజు ఆశావహుల నుంచి ఎలాంటి దరఖాస్తులు రాలేదు. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా టీఆర్‌ఎస్‌ 24, కాంగ్రెస్‌ 16, బీజేపీ 4, స్వతంత్రులు నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తున్నందున టీఆర్‌ఎస్‌ సంఖ్య 25కు చేరగా నాలుగు కో-ఆప్షన్‌ సభ్యుల పదవులను అధికార పార్టీ కైవసం చేసుకోనుంది. 

సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను నాలుగు కో ఆప్షన్‌ పదవులు రానున్నాయి. అందులో మైనార్టీ కేటగిరీలో 2, జనరల్‌ కేటగిరిలో 2 పదవులు రానున్నాయి. మైనార్టీ కేటగిరిలో ఒక మహిళ, జనరల్‌  కేటగిరిలో ఒక మహిళను ఎన్నుకోవాల్సి ఉంది.   

ఎవరు అర్హులంటే..

కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికయ్యే అభ్యర్థి మున్సిపాలిటీలో ఓటరుగా నమోదై ఉండాలి. స్థానిక సంస్థల్లో ఐదేళ్లపాటు కౌన్సిలర్‌, వైస్‌చైర్మన్‌, చైర్మన్‌, వార్డు సభ్యుడు, సర్పంచ్‌, ఉప సర్పంచ్‌గా పని చేసి ఉండాలి. గెజిటెడ్‌ హోదాలో ఉద్యోగ విరమణ పొందిన వారు, మూడేళ్లపాటు స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా పని చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చేతులు ఎత్తే పద్ధ్దతిలో ఎన్నికను నిర్వహించనున్నారు. ఎంపికైన కో-ఆప్షన్‌ సభ్యులు పాలకవర్గం సమావేశాల్లో పాల్గొనవచ్చు. కౌన్సిలర్‌గా వ్యవహరించవచ్చు. కానీ వీరికి ఓటు  హక్కు ఉండదు.   


logo