శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 23, 2020 , 02:57:21

నేటి నుంచి ఆర్టీసీలో పార్సిల్‌, కొరియర్‌ చార్జీలు అమల్లోకి

నేటి నుంచి ఆర్టీసీలో పార్సిల్‌, కొరియర్‌ చార్జీలు  అమల్లోకి

సూర్యాపేట అర్బన్‌ : ఆర్టీసీ సరుకు రవాణాకు సంబంధించి తగ్గించిన పార్సిల్‌, కొరియర్‌ చార్జీలు గురువారం నుంచి అమల్లోకి రానున్నట్లు సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ శివరామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో చిన్న, పెద్ద  పార్సిళ్లకు ఒకే విధంగా శ్లాబ్‌  ఉండేదని, ప్రస్తుతం వాటిని మార్చి ధరలను తగ్గించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సరుకు రవాణాలో మరిన్ని మార్పులను తీసుకువచ్చి ప్రజలకు చేరువలోకి తీసుకురానున్నట్లు వివరించారు. రాఖీ పండుగ నేపథ్యంలో రాఖీలను కొరియర్‌ ద్వారా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.


logo