సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 20, 2020 , 05:11:15

రూ.3.50లక్షల గుట్కా పట్టివేత

రూ.3.50లక్షల గుట్కా పట్టివేత

  • మూడు వాహనాలు సీజ్‌..
  • ఆరుగురు నిందితులపై కేసు  

మఠంపల్లి : అక్రమంగా తరలిస్తున్న రూ.3.50లక్షల విలువైన  ప్యాకెట్లను మఠంపల్లి మండల కేంద్రంలో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లు, ఒక టాటా ఏస్‌ వాహనాన్ని సీజ్‌ చేసి, ఆరుగురిని అరెస్టు చేశారు. ష్ట్రాంపల్లి  ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎ.రఘు వివరాలు వెల్లడించారు.   నుంచి గుట్కా ప్యాకెట్లను ఆంధ్రాకు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలో పోలీసులు దాడి చేసి  ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని వాహనాలను సీజ్‌ చేశారు.

వారిపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం మఠంపల్లి నుంచి ఆంధ్రా ప్రాంతానికి గుట్కా, మద్యం, బియ్యం అక్రమ రవాణా జరుగకుండా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ  తెలిపారు. హుజూర్‌నగర్‌ సీఐ రాఘవరావు, ఎస్‌ఐ వై.ప్రసాద్‌ సమన్వయంతో సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు నిర్వహించి అక్రమ  మూడు నెలల్లో 13కేసులు పెట్టినట్లు తెలిపారు.  చౌటపల్లి, మఠంపల్లి ప్రాంతాల్లో   గుట్కా ప్యాకెట్లను  ఐదు కేసులు నమోదు చేశామన్నారు. నాలుగు చోట్ల 294 క్వింటాళ్ల రేషన్‌  పట్టుకున్నట్లు తెలిపారు. రూ.90వేల విలువైన  బాటిళ్లు పట్టుకుని కేసులు నమోదు చేశామన్నారు. అక్రమ వ్యాపారాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ రాఘవరావు, ఎస్‌ఐ వై.ప్రసాద్‌, ఏఎస్‌ఐ రాఘవరావు తదితరులు ఉన్నారు. 


logo