శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 20, 2020 , 05:08:46

వచ్చేసిన జలసిరుల గోదావరి

వచ్చేసిన జలసిరుల గోదావరి

  • జిల్లాకు చేరిన ఎస్సారెస్పీ జలాలు
  • గతేడాది మాదిరిగానే ఎగువ నుంచి దిగువకు నీటి విడుదల 
  • తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నాలుగోసారి నీటి విడుదల  
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాలు జిల్లాకు చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం జనగామ జిల్లా బయ్యన్నవాగు రిజర్వాయర్‌ నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలలోని డీబీఎం 69 కాల్వలోకి ప్రవేశించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గోదావరి నీరు విడుదల కావడం ఇది నాలుగోసారి. గతేడాది మాదిరిగానే ఈ వానకాలంలోనూ ఎగువ నుంచి దిగువకు పంటలకు నీరందిస్తూ చెరువులు, కుంటలు నింపనున్నారు. కానీ ఈ సారి ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిని పాటించనున్నారు.  - తిరుమలగిరి

 తిరుమలగిరి : కాళేశ్వరం ్కృపాజెక్టుతో గోదారమ్మ పరుగులు పెడుతోంది. వానకాలం పంటల కోసం అప్పుడే జిల్లాకు చేరుకున్నది.  కాల్వ ద్వారా జనగాం జిల్లా బయ్యన్న వాగు రిజర్వాయర్‌ నిండి  పోస్తుండగా..  మండలం వెలిశాల వద్ద డీబీఎం 69 నుంచి గోదావరి జలాలు జిల్లాకు చేరాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా  పైచిలుకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోనున్నాయి.  సస్యశ్యామలం కానున్నాయి. 69, 70, 71 డీబీఎంకు 1800 క్యూసెక్కుల  విడుదల జరుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వలున్న తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, మద్దిరాల, సూర్యాపేట, చివ్వెంల, కోదాడ మండలాల్లో భూగర్భ జలాలు పెరిగి వానకాలం పంట చేతికి అందనుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

అలుగు పోస్తున్న బయ్యన్నవాగు రిజర్వాయర్‌

తిరుమలగిరి మండలంలోని వెలిశాల 69 డీబీఎంకు సరిహద్దులో ఉన్న బయ్యన్నవాగు రిజర్వాయర్‌ నిండి అలుగు పోస్తుంది. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట వద్ద ప్రారంభమయ్యే ఎస్సారెస్పీ రెండో దశ కాల్వ జనగాం జిల్లా కొడకండ్ల మండలంలోని బయ్యన్న వాగు రిజర్వాయర్‌ నుంచి తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద జిల్లాకు చేరుతాయి. ప్రధాన కాల్వతోపాటు 69, 70, 71 మెయిన్‌ డిస్ట్రిబ్యూటరీ (డీబీఎం) కాల్వలు ఉన్నాయి. వెలిశాల నుంచి నాగారం మండలం ప్రగతినగర్‌ వరకు 8 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ ఉంది.  డీబీఎం తిరుమలగిరి మండలంలోని వెలిశాల నుంచి మొదలవుతుంది. మొత్తం 27 కిలోమీటర్లు ఉన్న ఈ కాల్వ కింద 69,956 ఎకరాల ఆయకట్టు  దీంతో నూతనకల్‌, తుంగతుర్తి, మద్దిరాల మండలాలకు సాగు నీరు అందుతుంది.  మండలం  వద్ద    కింద  ఎకరాల ఆయకట్టు ఉంది.  కాల్వ ద్వారా నాగారం, అర్వపల్లి మండలాల్లో సాగునీరు అందుతుంది. నాగారం మండలం ప్రగతినగర్‌ వద్ద ప్రారంభమయ్యే 71వ డీబీఎం కాల్వ ద్వారా  సూర్యాపేట, చివ్వెంల, కోదాడ, నడిగూడెం, మోతె, మునగాల మండలాల్లోని 1,44,480 ఎకరాలకు సాగునీరు అందనుంది.

ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో సాగునీరు.. 

వానకాలం పంటలు కోసే వరకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో గోదావరి జలాలు అందనున్నాయి. అవసరం లేనప్పుడు వారం రోజులు నీళ్లు ఆపి అవసరం ఉన్న సమయంలో నీటిని విడుదల చేస్తారు. గోదావరి జలాలు ఎస్సారెస్పీ  ద్వారా మొదట ఎగువ కోదాడ నుంచి దిగువన సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు అందించనున్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి చెరువులు, కుంటలు నింపాలని ప్రభుత్వం భావిస్తుంది.

నాలుగో సారి నీటి రాక..

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సారెస్పీ ద్వారా జిల్లాకు నాలుగోసారి నీళ్లు వచ్చాయి. 2016లో తీవ్ర వర్షాభావ పరిస్థితిల్లో పంటలను కాపాడేందుకు  రోజులపాటు ఎస్సారెస్పీ  గోదావరి జలాలు అందించారు.  అక్టోబర్‌ 5న  పరిస్థితి ఉండగా.. పంటలను కాపాడేందుకు 20 రోజులు నీటిని విడుదల చేసి వందకు పైగా చెరువులను నింపారు. 2019 అక్టోబర్‌ 20న కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు వంద  పైగా విడుదల చేసి జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు నింపి రైతులను ఆదుకున్నారు.  సారి వానకాలం పంట చేతికొచ్చేవరకు  అందించాలని నిర్ణయించిన సర్కారు.. ఇప్పటికే నీటిని విడుదల చేసింది. ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ఎస్సారెస్పీ  ద్వారా సాగునీరు అందిస్తుండడంతో  సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు కృతజ్ఞతలు చెప్తున్నారు.  జలాలతో అన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలను నింపుతామని.. రైతులు తొందరపడి కాల్వలకు గండ్లు పెట్టవద్దని  సూచించారు. logo