మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 19, 2020 , 02:43:12

నాడు భీంరెడ్డి.. నేడు జగదీశ్‌రెడ్డి

నాడు భీంరెడ్డి.. నేడు జగదీశ్‌రెడ్డి

  • నాడు విముక్తి కోసం.. నేడు అభివృద్ధి కోసం 
  •  చరిత్రను మలుపు తిప్పిన రెండు ఉద్యమాలు 
  • మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌

నాగారం : సూర్యాపేట గడ్డపై పుట్టిన భీంరెడ్డి నర్సింహారెడ్డి వీర తెలంగాణ విముక్తి పోరాటంలో కీలకపాత్ర పోషిస్తే.. అదే గడ్డపై పుట్టిన మంత్రి జగదీశ్‌రెడ్డి  తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాడని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ గడ్డ అభివృద్ధి కోసం ఆనాడు భీంరెడ్డి కన్న కలలను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో నేడు మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నేడు సాకారమవుతున్నాయన్నారు.

స్వరాష్ట్రంలో సుపరిపాలన కోసం సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అధినేత కేసీఆర్‌ వెంట ఆది నుంచి వెన్నంటి ఉన్న ఘనత కూడా జగదీశ్‌రెడ్డిదేనని పేర్కొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి 55వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, మంత్రి తండ్రి, పార్టీ సీనియర్‌ నేత గుంటకండ్ల రామచంద్రారెడ్డి, ఇతర నేతలతో కలిసి ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ జనగాం-సూర్యాపేట రహదారి వెంట మొక్కలు నాటారు. తండ్రి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా మంత్రి జన్మదిన వేడుకల కేక్‌ కట్‌ చేయించారు.

అనంతరం ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో గోదావరి జలాలు అనేవి ఓ కలగా మారాయన్నారు. ఇందుకోసం భీంరెడ్డి నర్సింహారెడ్డి జీవితాంతం పోరాటం చేసినా సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నేడు తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో గోదావరి జలాలు సీఎం కేసిఆర్‌తోనే సాధ్యమయ్యాని చెప్పారు. ఏండ్ల తరబడి బీడుగా ఉన్న ఈ ప్రాంతం నేడు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సూర్యాపేట ప్రత్యేక జిల్లా ఏర్పాటులోనూ, ఎన్నడూ కలలో   

      కూడా ఊహించని మెడికల్‌ కాలేజీ ఇక్కడికి రావడంలోనూ మంత్రి జగదీశ్‌రెడ్డిది కీలకపాత్ర అన్నారు.  జన్మదినం సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డికి పెద్ద ఎత్తున మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ కూరం మణివెంకన్న, వైస్‌ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, గుంటకండ్ల రామచంద్రారెడ్డి, తాసిల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీఓ దార శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, శోభన్‌బాబు, గుండగాని అంబయ్య, దోమల బాలమల్లు, పొదిల రమేశ్‌, పానుగంటి నర్సింహారెడ్డి, ఈదుల కిరణ్‌కుమార్‌, కుంభం కరుణాకర్‌, చిప్పలపల్లి స్వప్న, నర్సింహారెడ్డి, తరాల ఆంజనేయులు, కుంట్లపల్లి సుధాకర్‌, సాలయ్య, బోయిని లింగమల్లు, ఈరేటి అంజయ్య, భద్రబోయిన సైదులు  పాల్గొన్నారు. 


logo