సోమవారం 10 ఆగస్టు 2020
Suryapet - Jul 19, 2020 , 02:17:31

జాతీయ రహదారి మీదుగా గంజాయి రవాణా

జాతీయ రహదారి మీదుగా గంజాయి రవాణా

  • లగ్జరీ వాహనాలు, కార్లలో తరలింపు..
  • 17రోజుల్లో 366కిలోలు పట్టివేత
  • కళ్లుగప్పి తరలిపోతున్నది మరింత అదనం

సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఆశతో కొందరు గంజాయి రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జాతీయ రహదారి మీదుగా తరలిస్తూ దర్జాగా వ్యాపారం సాగిస్తున్నారు. విశాఖ మన్యం నుంచి విభిన్న మార్గాల్లో గంజాయిని హైదరాబాద్‌, ముంబై, పూణె, నాగ్‌పూర్‌ తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా, ఎలాంటి అనుమానం రాకుండా లగ్జరీ వాహనాలను వినియోగిస్తూ కార్ల సీట్లకింద, బానెట్లలో తరలిస్తున్నారు. కట్టంగూరు, నకిరేకల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గంజాయి రవాణా వెలుగుచూడగా.. తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు పెద్ద మొత్తంలో సరుకును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో అడపాదడపా కిలోల కొద్దీ గంజాయి పట్టుబడి కేసులు నమోదవుతున్నప్పటికీ అక్రమ రవాణాకు మాత్రం పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు.

సూర్యాపేట :  అక్రమ రవాణాకు 65వ నెంబర్‌ జాతీయ రహదారి రాజమార్గంగా మారింది. పొలీసుల వాహన తనిఖీలు లేకపోవడంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. గడిచిన 20 రోజుల్లో ఈ రహదారిపై 142 కిలోలు, పాత జాతీయ రహదారిలో ఉన్న సూర్యాపేట పట్టణంలో 40 కిలోల  పట్టుబడడం గమనార్హం. అయితే.. 142 కిలోల గంజాయి  ప్రమాదాల ద్వారా దానంతట అదే బయటపడింది. దైదచలం, మహబూబాబాద్‌, ఛత్తీస్‌గఢ్‌, విశాఖపట్నం అటవీ దైపాంతాల నుంచి ప్యాకెట్ల రూపంలో వాహనాల్లో హైదరాబాద్‌ వంటి నగరాలకు తరలిస్తున్నారు.  చోట్లనే 182 కిలోలకు   పోలీసుల  కప్పి ఇంకెంత  తరలిస్తున్నారో   

కరోనా కట్టడిలో పోలీసులు   అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది.  గుట్టుగా రవాణా  సొమ్ము చేసుకుంటున్నారు.  65వ జాతీయ  రాచమార్గంగా ఎంచుకున్నారు. భద్రాచలం, మహబూబాబాద్‌, ఛత్తీస్‌గఢ్‌, విశాఖపట్నం అటవీ ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు.  ఇటీవల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. జూన్‌ 26వ తేదీన కట్టంగూర్‌ శివారులో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.  వాహనంలో 80 కిలోల గంజాయి దొరికింది.  నెల  నకిరేకల్‌ మండలం చందంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 62 కిలోల గంజాయి బయటపడింది. అదేరోజు చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనం  పడగా.. 86 కిలోలు పట్టుబడింది. సూర్యాపేట పట్టణంలోని పాత జాతీయ రహదారిలో పోస్టాఫీసు వద్ద సూర్యాపేట సీసీఎస్‌ పోలీసులు 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. తాజాగా ఆదివారం  80 కిలోలు వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

సూర్యాపేటలో పెద్ద ఎత్తున స్వాధీనం

భద్రాచలం, మహబూబాబాద్‌, ఛత్తీస్‌గఢ్‌, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేసేందుకు సూర్యాపేట పట్టణాన్ని సేఫ్‌ జోన్‌గా ఎంచుకున్నారు.  జాతీయ రహదారి పక్కనే ఉన్న ఒక ప్రైవేటు హాస్టల్‌లో 2017లో 182 కిలోల  పట్టుబడడం ఇందుకు ఉదాహరణ.  పట్టణంలోని పలు ప్రాంతాల్లోనూ  పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి.  6 గంజాయి కేసులు నమోదు కాగా.. 112 కిలోలు స్వాధీనం చేసుకొని 8మందిని అరెస్టు చేశారు. 2019లో 9 కేసుల్లో 22 కిలోల  పట్టుకొని 13 మందిని అరెస్టు చేశారు.  ఇప్పటి వరకు 3 కేసుల్లో 45 కిలోల  పట్టుబడగా..  అరెస్టు చేసి జైలుకు పంపారు. 

ఈజీ మనీ కోసం..

ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు గంజాయి అక్రమ రవాణాను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం  వచ్చిన కొత్త వాహనాలను ఉపయోగిస్తున్నారు.  వాహనాలు అయితే లగ్జరీగా ఉండి ఎవరికీ అనుమానం రాదని భావిస్తున్నారు.  వాహనాలు కొనుగోలు చేసి అక్రమ రవాణాకు వాడుతున్నారు.  జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలో గతంలో రెండు కొత్త వాహనాలు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డాయి.


logo