బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 18, 2020 , 01:48:02

రైతు వేదికలతో వ్యవసాయంలో మార్పులు

రైతు వేదికలతో వ్యవసాయంలో మార్పులు

  • ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల: రైతువేదికలతో వ్యవసాయరంగంలో పెనుమార్పులు సంభవిస్తాయని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి, చిన్నకాపర్తిలో రైతువేదికల నిర్మాణానికి, గుండ్రాంపల్లిలో సీసీ రోడ్డు, వైకుంఠధామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న వసతులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ఈ వేదికల నుంచి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. అనంతరం గ్రామాల్లో మొక్కలు నాటారు. గుండ్రాంపల్లిలో డీసీసీబీ వైస్‌  చైర్మన్‌ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, ఎంపీపీ కొలను సునీతావెంకటేశం, జడ్‌పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, సర్పంచ్‌ రత్నం పుష్ప, ఎంపీటీసీ దుబ్బ పద్మాకుమారస్వామి, కోఆప్షన్‌ సభ్యుడు మోసిన్‌, అద్దెల లింగారెడ్డి, వ్యవసాయాధికారి గిరిబాబు, ఏఈ శంకర్‌బాబు, చిన్నకాపర్తిలో సర్పంచ్‌ బోయపల్లి వాణీశ్రీనివాసు, ఎంపీటీసీ అంజమ్మాస్వామి, సింగిల్‌విండో చైర్మన్‌ రుద్రారపు భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

2గంటల వరకే షాపులు తెరవాలి 

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 20 నుంచి వ్యాపారసంస్థలు ఉదయం 6నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే తెరిచి ఉంచాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. వ్యాపారవర్గాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా వ్యాపారులు సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, కమిషనర్‌ అయిత ప్రభాకర్‌, ఎస్‌ఐ రావుల నాగరాజు, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ మెండె సైదులు, కౌన్సిలర్లు, వివిధ వ్యాపార వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.


logo