శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 17, 2020 , 03:48:21

సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  •  యువత ఆన్‌లైన్‌ ఆటలకు బానిసకావొద్దు..
  • సూర్యాపేట ఎస్పీ భాస్కరన్‌

సూర్యాపేటసిటీ : ప్రజల అవసరాలను అవకాశంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ బానిసలై ఆటల మధ్యలో వచ్చే ఆట పరికరాలు కొనుగోలు చేయడానికి యాప్‌ నిర్వాహకులు చూపే బ్లూ లింక్స్‌కు బ్యాంక్‌ ఖాతా, డెబిట్‌, క్రెడిట్‌, వ్యాలెట్‌ వివరాలు పంపి డబ్బులు పొగొట్టుకోవద్దని సూచించారు.

సైబర్‌ నేరగాళ్లు అవకాశం కోసం కాచుకొని ఉన్నారని బ్యాంకు వివరాలు దొరికితే మీ ఖాతా ఖాళీ అవుతుందన్నారు. ఆన్‌లైన్‌ ఆటలు ఆడవద్దన్నారు. యువత, విద్యార్థులు అంతర్జాలన్ని జ్ఞాన సముపార్జనకే సద్వినియోగం చేసుకోవాలన్నారు.  తల్లిదండ్రులు పిల్లలకు ఇంట్లో ఆడుకునే సంప్రదాయ ఆటలు నేర్పించాలన్నారు. ప్రభుత్వ పథకాల పేరిట  కూడా సైబర్‌ నేరగాళ్లు గాలం వేస్తున్నారని సోషల్‌ మీడియాలో వచ్చే ప్రచారంలో నిజానిజాలు గ్రహించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అందిస్తామని మీకు కంపెనీ బహుమతి వచ్చిందని బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేవంటూ అపరిచితులు ఫోన్‌ చేసి మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా గుర్తింపు వివరాలు అడిగితే ఇవ్వద్దన్నారు. మోసగాళ్లను పట్టించేందుకు స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. logo