మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 17, 2020 , 03:37:06

రూ.లక్ష విలువ చేసే గుట్కాల పట్టివేత

రూ.లక్ష విలువ చేసే గుట్కాల పట్టివేత

గరిడేపల్లి : మండలంలోని కల్మల్‌చెర్వు గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.లక్ష విలువ చేసే గుట్కా ప్యాకెట్లను గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ ఎన్‌.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు  అమ్ముతున్నారనే సమాచారం మేరకు దాడి చేయగా లభించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మఠంపల్లి మండలం హనుమంతులగూడెం గ్రామానికి చెందిన ఎ.వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. ఈ దాడుల్లో పోలీస్‌ సిబ్బంది ప్రవీణ్‌, శ్రీను, శ్రీనివాసరావు, సంజీవరెడ్డి, వీరాస్వామి పాల్గొన్నారు. 


logo