గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jul 14, 2020 , 04:24:11

రైతు బంధుకు దరఖాస్తు చేసుకోవాలి

రైతు బంధుకు దరఖాస్తు చేసుకోవాలి

సూర్యాపేట : జూన్‌ 16 వరకు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు వానకాలం రైతుబంధు కోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 23 మండలాల్లో 6,000 మంది రైతులు ఇంకా దరఖాస్తు చేసుకోలేదని,  దరఖాస్తు చేసుకోని రైతుల వివరాలను ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు పంపించినట్లు పేర్కొన్నారు. భూ వివరాలు డిజిటల్‌ సంతకం అయిన వారు సైతం వివరాలు ఇవ్వవచ్చని సూచించారు. ఇటీవల కొందరు రైతు బంధు నగదు తమ ఖాతాలో జమ కాలేదని  పేర్కొన్నారని, అందుకు వారి ఖాతాలో ఉన్న సమస్యలే కారణమన్నారు. జన్‌ ధన్‌ ఖాతాలో ఎక్కువ నగదు పడడం, మూడు నెలలుగా ఖాతాలో లావాదేవీలు లేకపోవడంతో రైతు బంధు డబ్బులు పడడం లేదని వివరించారు. రైతులు మరో ఖాతా వివరాలను అధికారులకు ఇవ్వాలని సూచించారు.      


logo