మంగళవారం 11 ఆగస్టు 2020
Suryapet - Jul 14, 2020 , 04:23:06

ఆన్‌లైన్‌లో పంట సాగు వివరాలు నమోదు చేసుకోవాలి

 ఆన్‌లైన్‌లో పంట సాగు వివరాలు నమోదు చేసుకోవాలి

  • జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిర్మయి

సూర్యాపేట రూరల్‌ /పెన్‌పహాడ్‌ : వానకాలంలో రైతులు తమ పంట పొలాల్లో ఏఏ పంటలు ..ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి సూచించారు. సోమవారం సూర్యాపేట మండలం కేసారం, పెన్‌పహాడ్‌ మండలం సింగారెడ్డిపాలెం గ్రామాల్లో ‘పంటల సాగు-కాస్తు నమోదు’ వివరాల నమోదును ఆమె పరిశీలించారు. అనంతరం రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారి అనుమానాలను నివృత్తి చేశారు. ప్రతి రైతు ఏపంట సాగు చేశారు. ఏరకం ఏనీటి సదుపాయం కింద వంటి వివరాలను అందజేస్తే ప్రభుత్వం పంట కొనుగోలు సమయంలో  ఉపయోగంగా ఉంటుందన్నారు. కార్యక్రమాల్లో  ఏడీఏ రామారావు నాయక్‌, ఏఓలు కృష్ణసందీప్‌, జానీమియా, ఏఈఓ మనోజ్‌, సర్పంచులు మెంతబోయిన నాగయ్య, సర్పంచ్‌ షరీపొద్దీన్‌,కొల్లు రేణుక, ఎంపీటీసీ బంటు నాగమ్మ, ఏఈఓ ముత్తయ్య, ఏటీఎం శ్రీహిత, పంచాయతీ కార్యదర్శులు ప్రదీప్‌కుమార్‌, నందు, రైతులు నరేశ్‌, సైదులు, మున్న వెంకన్న, ఒగ్గు వెంకన్న  పాల్గొన్నారు.


logo