బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 14, 2020 , 04:21:00

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజాసమస్యలను  సత్వరమే పరిష్కరించాలి

  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట : కరోనా మహమ్మారి వల్ల ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించ లేకపోతున్నా అనేక మంది తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్‌కు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని వివిధ ప్రాం తాల  నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి సమస్యలను పరిష్కరించి వారికి వివరించాలని చెప్పారు. జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో విషజ్వరాలు, వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు తరచు గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. 

హరితహారంలో భాగస్వాములవ్వాలి 

 అర్వపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని    సూర్యాపేట కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు . మండలంలోని జాజిరెడ్డిగూడెంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. నాటిన మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. గ్రామంలో వీధుల వెంట ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం జాజిరెడ్డిగూడెం గ్రామశివారులోని మూసీవాగును సందర్శించి ఇసుక రీచ్‌ను పరిశీలించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట తాసిల్దార్‌ హరిశ్చంద్రప్రసాద్‌, ఎంపీఓ రాజు, ఏపీఓ శైలజ, వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఉన్నారు. 


logo