గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jul 14, 2020 , 04:17:12

చిట్టడవిని తలపిస్తున్న.. హైటెక్‌ బస్టాండ్‌ ఆవరణ

 చిట్టడవిని తలపిస్తున్న..  హైటెక్‌ బస్టాండ్‌ ఆవరణ

  • ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్న పచ్చదనం


భానుపురి  : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హైటెక్‌ బస్టాండ్‌ ఆవరణ పచ్చని చెట్లతో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సుమారు ఆరెకరాల విస్తీర్ణంలో ఉన్న హైటెక్‌ బస్టాండ్‌ ఆవరణలో ఆర్టీసీ అధికారులు హారితహారంలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్క లు నాటుతూ వస్తున్నారు. ఆ మొక్కలు పెరిగి చిన్నపాటి అడవిని తలపిస్తున్నాయి. బస్టాండ్‌ లోపలికి బస్సులు వచ్చే, వెళ్లే మార్గాల్లో సైతం చెట్లు హరితతోరణాల్లా ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నాయి.

కొద్దిమేర పూలమొక్కలను నాటి ప్రత్యేక కంచె ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. టేకు, వేప, కానుగ, నల్లమద్ది తదితర చెట్లు బస్టాండ్‌ ఆవరణాన్ని పచ్చదనంతో నింపేశాయి. క్యాంటిన్‌ వెనుక భాగంలో మినీ పార్కు కూడా ఏర్పాటు చేశారు. ఆరో విడుతలో కొత్త బస్టాండ్‌, డిపో గ్యారేజీ ఆవరణలో మొక్కలు నాటాలని నిర్ణయించామని, మొక్కల సంరక్షణ బాధ్యతను కొంతమంది సిబ్బందికి అప్పగించినట్లు డిపో మేనేజర్‌ రామకృష్ణ తెలిపారు. ట్రీ గార్డులు ఏర్పా టుకు దాతలు సహకరించాలని కోరారు.


logo