శుక్రవారం 07 ఆగస్టు 2020
Suryapet - Jul 13, 2020 , 03:47:27

సీఎం సహాయనిధి పేదలకు అండ

సీఎం సహాయనిధి పేదలకు అండ

  • దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ 

చందంపేట (దేవరకొండ) : సీఎం సహాయనిధి పేదలకు అండగా నిలుస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామానికి చెందిన జల్‌సింగ్‌కు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన లక్ష రూపాయల చెక్కును దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలుప్రవేశపెట్టారని తెలిపారు.  సర్పంచ్‌ మూడావత్‌ శ్రీను, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పుల గోవిందుయాదవ్‌, బొడ్డుపల్లి కృష్ణ, విజయ్‌ తదితరులు ఉన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత

గుర్రంపోడు : మండలంలోని ఏడుగురికి  సహాయ నిధి నుంచి మంజూరైన 1,15,000 రూపాయల  స్థానిక టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బాధితులకు ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌  గజ్జెల చెన్నారెడ్డి, గౌరవాధ్యక్షుడు బొడ్డుపల్లి బ్రహ్మచారి, నాయకులు  జానయ్య, జాల పెద్ద సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


logo