శనివారం 08 ఆగస్టు 2020
Suryapet - Jul 13, 2020 , 03:38:05

వైద్య సిబ్బందిపై దాడి చేసిన వ్య‌క్తిపై కేసు న‌మోదు

వైద్య  సిబ్బందిపై దాడి చేసిన వ్య‌క్తిపై కేసు న‌మోదు

హుజూర్‌నగర్‌  : డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన ఓ వ్యక్తిపై ఆదివారం కేసు నమోదైంది. ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటి  సమయంలో ప్రభుత్య ఏరియా దవాఖాన సిబ్బంది అత్యవసర సేవల్లో ఉన్నారు. ఆ సమయంలో  గ్రామానికి చెందిన అమీర్‌సాబ్‌ వారి విధులను అడ్డుకొని తాను చింతలపాలెం గ్రామ సర్పంచ్‌ భర్తను అంటూ దురుసుగా ప్రవర్తించాడు.  దుర్భాషలాడాడు. డ్యూటీలో ఉన్న  డాక్టర్‌ నరేశ్‌ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


logo