మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 13, 2020 , 03:31:42

మోస్తరు వర్షం

మోస్తరు వర్షం

  •  సూర్యాపేటలో అత్యధికంగా 42.6మి.మీటర్లు 
  • నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో 27.9మి.మీటర్లు 

 సూర్యాపేట అర్బన్‌ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వర్షం జిల్లా కేంద్రంలో అత్యధికంగా 42.6మి.మీటర్లు, అత్యల్పంగా మఠంపల్లిలో 2.4 మి.మీటర్లుగా నమోదైంది. తుంగతుర్తి, గరిడేపల్లి, ఆత్మకూరు, తిరుమలగిరి, పెన్‌పహాడ్‌, చిలుకూరు, హూజూర్‌నగర్‌,  నేరేడుచర్ల, మేళ్లచెర్వులో వర్షపాతం నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. జిల్లాలో మొత్తం వర్షపాతం 249.6 మి.మీటర్లు నమోదుకాగా సగటున 13.9మి.మీటర్లుగా నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం మేఘావృతమై సాయంత్రం జిల్లా అంతటా మోస్తరు వర్షం కురిసింది.  

నల్లగొండ జిల్లాలోని 12మండలాల్లో.. 

నల్లగొండ రూరల్‌ : జిల్లాలో ఆదివారం 12మండలాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో అత్యధికంగా కట్టంగూర్‌లో 27.9 మి.మీటర్లు, నకిరేకల్‌ 25.9, కేతేపల్లి 27.7 శాలిగౌరారం 21.4, మిర్యాలగూడ 17.8, నిడమనూరు 13.6, కనగల్‌11, అనుముల 10.9, త్రిపురారం 7.7, మాడ్గులపల్లి 7.5, వేములపల్లి 6.3, నల్లగొండ 4.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 137మి.మీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా 145.5 మి.మీటర్లు కురిసింది.   


logo