మంగళవారం 11 ఆగస్టు 2020
Suryapet - Jul 12, 2020 , 08:44:22

గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

  • జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

మేళ్లచెర్వు : గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మేళ్లచెర్వు మండలకేంద్రంతో పాటు వెల్లటూరు, హేమ్లాతండా గ్రామాల్లో శనివారం డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్మాణపనుల్లో అలసత్వం వహిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. తొలుత మేళ్లచెర్వులో నిర్మాణంలో ఉన్న శ్మశానవాటిక పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వెల్లటూరులో శ్మశానవాటికను సందర్శించి దానిపక్కనే నీరు నిల్వ ఉండడంతో మరో అనువైన ప్రదేశంలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. హేమ్లాతండాలో పర్యటించి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మేళ్లచెర్వులో హరితహారంలో భాగంగా మొక్క నాటారు. నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట హుజూర్‌నగర్‌ ఆర్డీఓ వెంకారెడ్డి, ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్‌రావు, జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మాగోవిందరెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఇమ్రాన్‌, తాసిల్దార్‌ దామోదర్‌రావు, ఎంపీడీఓ  ఇసాక్‌హుస్సేన్‌, ఎంపీఓ వీరయ్య, సర్పంచులు,  కార్యదర్శులు ఉన్నారు.


logo