బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 12, 2020 , 08:42:55

పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన

 పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన

నూతనకల్‌/ తుంగతుర్తి/ మద్దిరాల : రైతు శ్రేయస్సే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. నూతనకల్‌ మండల పరిధిలోని మిర్యాల, దిర్శనపల్లి, తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి, మద్దిరాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామాల్లో శనివారం రైతువేదికల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తుందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఇతర విషయాలపై చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలకు శ్రీకారం చుట్టి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయా కార్యక్రమాల్లో నూతనకల్‌ మండలంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ ఎస్‌ఏ రజాక్‌, ఎంపీపీ భూరెడ్డి కళావతి, జడ్పీటీసీ దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకన్న, సర్పంచ్‌ సునీత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్లయ్య పాల్గొన్నారు. తుంగతుర్తి మండలంలో డీసీసీబీ డైరెక్టర్‌ గుడిపాటి సైదులు, ఎంపీపీ గుండగాని కవిత, ఎంపీడీఓ, ఎంపీటీసీ, సర్పంచ్‌ పాల్గొన్నారు. మద్దిరాల మండలంలో ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర, జడ్పీటీసీ సురాంబ, సర్పంచ్‌ జ్యోతి, వైస్‌ ఎంపీపీ శ్రీరాంరెడ్డి, ఎంపీడీఓ, తాసిల్దార్‌ పాల్గొన్నారు.


logo