మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 11, 2020 , 04:30:37

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి

రైతులు ప్రత్యామ్నాయ  పంటల వైపు దృష్టి సారించాలి

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

కనగల్‌ : రైతులు వరి, పత్తి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చెట్లచెన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని నరసింహాపురం గ్రామంలో రైతు(తెలంగాణ స్టేట్‌ సెరికల్చర్‌ సమన్వయ కమిటీ సభ్యుడు) జెల్లా పుండరీకం ఐదెకరాల్లో సాగుచేస్తున్న మల్బరీసాగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేసుకుంటూనే దిగుబడులు సాధించవచ్చన్నారు. మల్చరీ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నందున యువత ముందుకురావాలన్నారు. ఆయన వెంట తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, రైతు పుండరీకం ఉన్నారు.


logo