ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 11, 2020 , 04:29:09

గ్రామాల్లో పచ్చని వాతావరణం ఏర్పాటుచేయాలి

గ్రామాల్లో పచ్చని వాతావరణం ఏర్పాటుచేయాలి

  • సూర్యాపేట కలెక్టర్‌ వినయ్‌ కృష్ణ్ణారెడ్డి

సూర్యాపేటరూరల్‌ : హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి గ్రామాల్లో పచ్చని, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేయాలని సూర్యాపేట కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా మండల పరిధిలోని టేకుమట్ల - సోలిపేట రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఎండ్లపల్లి గ్రామం వద్ద మొక్కలు నాటి మాట్లాడారు. టేకుమట్ల గ్రామం నుంచి సోలిపేట గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్కలు నాటాలని, మొక్క పోతే దానిస్థానంలో మరో మొక్క నాటాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్‌, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


logo