గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 11, 2020 , 04:23:35

వ్యవసాయంలో మార్పు కోసమే రైతు వేదికలు

వ్యవసాయంలో మార్పు కోసమే రైతు వేదికలు

  • అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం 
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 
  •  నిడమనూరు, త్రిపురారంలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన

వ్యవసాయరంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నదని, రైతులను సంఘటితం చేసి లాభసాటి వ్యవసాయం కోసం రైతు వేదికలు నిర్మిస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిడమనూరు, త్రిపురారం మండల కేంద్రాల్లో రైతు వేదికల భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేసి రైతులే ధర నిర్ణయించే రోజు రావాలన్నది సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, అందుకనుగుణంగా రైతులు సిద్ధం కావాలని సూచించారు. 

నిడమనూరు/త్రిపురారం : వ్యవసాయంలో గణనీయమైన మార్పు తెచ్చేందుకే రైతు వేదికల నిర్మాణాలకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నిడమనూరు, త్రిపురారం   మండల కేంద్రాల్లో శుక్రవారం రైతు వేదిక నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా 24గంటల ఉచిత విద్యుత్‌, సాగుకు పెట్టుబడి అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. పంటల ధర నిర్ణయంలో రైతు భాగస్వామ్యం పెంచాలన్న సంకల్పంతోనే రైతువేదికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పంటల సాగు మొదలు అనేక కీలక అంశాలను చర్చించుకునేందుకు రైతు వేదికలు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, నాగార్జునసాగర్‌, నల్లగొండ,తుంగతుర్తి ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌సింగ్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్‌, నిడమనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కామర్ల జానయ్య, ఎంపీపీలు బొల్లం జయమ్మ, అనుముల పాండమ్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు సత్యపాల్‌, నరేందర్‌, విరిగినేని అంజయ్య, వెంకటరమణ, పోలె డేవిడ్‌, రామారావు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


logo