సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 10, 2020 , 04:35:03

మోస్తరు వర్షం

మోస్తరు వర్షం

హుజూర్‌నగర్‌/నల్లగొండ :  సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని 7మండలాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నేరేడుచర్ల మున్సిపాలిటీతోపాటు గరిడేపల్లి, మేళ్లచెర్వు మండలాల వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గంటపాటు వాన పడడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, ఖాళీ స్థలాల్లో భారీగా వరద చేరింది. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం, నకిరేకల్‌, కట్టంగూర్‌, మిర్యాలగూడలో మోస్తరు వర్షం కురిసింది. రెండ్రోజులుగా ఎండ, ఉక్కపోతతో తల్లడిల్లిన ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం కల్గింది. ఇప్పటికే నార్లు పోసిన రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని, పత్తి గింజలు విత్తిన రైతులకు కొంతమేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు పేర్కొన్నారు.   


logo