శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 08, 2020 , 00:33:23

పట్నం పొమ్మంది.. పల్లె రమ్మంది

 పట్నం పొమ్మంది.. పల్లె రమ్మంది

  • గ్రామాలకు చేరుకుంటున్న వలస జీవులు
  • ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో మారిన పరిస్థితులు
  • పెద్దఎత్తున పంటల సాగు..స్థానికంగానే ఉపాధి
  • సాగునీరు, ఉచిత కరెంట్‌,రైతుబంధుతో భరోసా
  • ఎవుసం వైపు యువత ఆసక్తి

గతంలో ఉన్న ఊళ్లో ఉపాధి అవకాశాలు లేక పట్నం బాటపట్టిన ప్రజలు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. కరోనా సమయంలో పట్టణాల్లో పనులు ఆగిపోవడంతో సొంతూరుకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. సాగునీరు, ఉచిత విద్యుత్‌, రైతు బంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతుండడంతో చాలా మంది సాగువైపు మళ్లుతున్నారు. ఇప్పటికే కొద్దిమంది రైతులు  కౌలుకిచ్చిన భూములతోపాటు పడావుపడిన భూములను తామే సాగుచేసుకుంటున్నారు. అంతేగాక యువత కూడా వ్యవసాయం వైపు దృష్టిసారిస్తుండడంతో పల్లెల్లో గత వైభవం కనిపిస్తోంది.

మునుగోడు : మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురానికి చెందిన గుండె ధనమ్మ-దినేశ్‌ దంపతులకు ఐదెకరాల భూమి ఉంది. నాటి ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం గిట్టుబాటు కాలేదు. తమ భూమిని కౌలుకు ఇచ్చి 2014లో పొట్ట చేతబట్టుకొని ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేటు పాఠశాలలో ధనమ్మ టీచర్‌గా పనిచేయగా, దినేశ్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేశాడు. కరోనా సంక్షోభంలో ఇద్దరికీ ఉపాధి కరువవగా.. సొంతూరికి వచ్చారు. ఎకరాకు రూ.5వేల చొప్పున టీఆర్‌ఎస్‌ సర్కారు అందించిన రూ.25 వేలతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నా రు. పత్తి తో పాటు వరి, ఇతర పప్పు ధాన్యాలను సాగు చేస్తున్నారు. కరోనా సంక్షోభంతో తమ ఉపా ధి పోయిందని. దీంతో ఏమి చేయాలో తోచని పరిస్థితిలో గ్రామానికి రాగా టీఆర్‌ఎస్‌ సర్కారు అమలుచేస్తున్న రైతుబంధు పథకమే కొండంత ధైర్యాన్నిచ్చిందని ధనమ్మ, దినేశ్‌ దంపతులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పెట్టుబడి సాయంతో విత్తనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు.   logo