గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jul 07, 2020 , 05:51:29

వీధులను హరితవనాలుగా తీర్చిదిద్దాలె

వీధులను హరితవనాలుగా తీర్చిదిద్దాలె

  • మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యత చేపట్టాలి  
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 

సూర్యాపేటటౌన్‌ : తెలంగాణకు హరితహారంలో భాగంగా వీధులన్నింటినీ హరితవనాలుగా తీర్చిదిద్దాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆరో విడుత హరితహరంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని 13, 19వ వార్డులతోపాటు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మొక్కలు నాటి మాట్లాడారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించి భవిష్యత్‌తరాలకు ఆరోగ్యవంతమైన జీవితం అందించాలంటే పచ్చదనం పెంపొందించడమే సరైన మార్గమన్నారు. అందుకు అందరం మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. రోడ్లు, కాల్వకట్టలు, పార్కులు, శ్మశానవాటికలు, ఖాళీ స్థలాలతోపాటు ప్రతి ఇంటిలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.

కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, ఇన్‌చార్జి డీఆర్‌ఓ మోహన్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి, కౌన్సిలర్లు అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీను, వట్టె రేణుక, తాసిల్దార్‌ వెంకన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.   


logo