గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 06, 2020 , 03:24:18

మూసీ గేటు బిగింపు పనులు షురూ

మూసీ గేటు బిగింపు పనులు షురూ

  • నాలుగైదు రోజుల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు 

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నూతన రెగ్యులేటరీ గేటు బిగింపు పనులను అధికారులు ఆదివారం ప్రారంభించారు. ఇటీవల తొలగించిన స్టాప్‌లాగ్‌ గేటు స్థానంలో శాశ్వత ప్రాతిపదికన రూ.1.79 కోట్లతో నూతన గేటును తయారు చేయించారు. వారం రోజుల క్రితం నూతన గేటును హైదరాబాద్‌ నుంచి ప్రాజెక్టు వద్దకు తీసుకువచ్చారు. ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా తీసివేసి పాత గేటును తొలగించారు. అనంతరం భారీ క్రేన్ల సహాయంతో   గేటు విడిభాగాలను కిందకు దించుతున్నారు. గేటుకు మొత్తం 2 ప్రధాన భాగాలుండగా మొదటి భాగాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. మిగిలిన భాగాన్ని సోమవారం ఏర్పాటు చేసి మరో నాలుగు రోజుల్లో గేటు ఏర్పాటు పనులు  పూర్తిచేయనున్నట్లు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు.ఈ సందర్భంగా ఈఈ భద్రూనాయక్‌ గేటు ఏర్పాటు పనులను పరిశీలించారు.ఆయన వెంట డీఈ నవీకాంత్‌, ఏఈ శ్రీకాంత్‌  ఉన్నారు.
logo