శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 06, 2020 , 03:06:04

కల్లాల నిర్మాణాలకు శ్రీకారం నేడే

కల్లాల నిర్మాణాలకు  శ్రీకారం నేడే

  • చివ్వెంల, పెన్‌పహాడ్‌లో శంకుస్థాపన  చేయనున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న మరో కానుక ‘పొలాల వద్దే కల్లాలు’ కార్యక్రమానికి నేడు జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేట నియోజకవర్గ  పరిధిలోని చివ్వెంల, పెన్‌పహాడ్‌ మండలాల్లో కల్లాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో రూ.31.42కోట్ల వ్యయంతో 4,511 కల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చిన రైతులను గుర్తించారు. సూర్యాపేట నియోజకవర్గంలో రూ. 6,13,53,000 అంచనా వ్యయంతో 881 కల్లాలు నిర్మించనుండగా, హుజూర్‌నగర్‌లో రూ.9,53,80,000 అంచనా వ్యయంతో 1369 కల్లాలు, కోదాడలో రూ.8,67,79000తో 1246, తుంగతుర్తిలో రూ.7,06,91,000తో 1015 కల్లాలు నిర్మించబోతున్నారు. 


logo