ఆదివారం 09 ఆగస్టు 2020
Suryapet - Jul 05, 2020 , 05:03:11

రైతుబంధు సమితి నేత లాలూనాయక్‌ హత్య

రైతుబంధు సమితి నేత లాలూనాయక్‌ హత్య

  •  బైక్‌పై వెళ్తుండగా కర్రలు, రాడ్లతో దాడి చేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు
  •  లాలూనాయక్‌ కూతురు, జడ్పీటీసీ పవిత్రకు సైతం స్వల్ప గాయాలు
  •   చందంపేటలో మళ్లీ రాజకీయ కలకలం

చందంపేట మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు రమావత్‌ లాలూనాయక్‌ దారుణ హత్యకు గురయ్యాడు. తన కూతురు, జడ్పీటీసీ పవిత్రతో కలిసి శనివారం  సాయంత్రం బైక్‌పై వెళ్తున్న ఆయనపై పోలేపల్లి స్టేజీ వద్ద కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన లాలూనాయక్‌.. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతిచెందాడు. దాడిలో పవిత్రకు సైతం స్వల్పగాయాలయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యంలో చందంపేటలో మరోసారి రాజకీయంగా కలకలం రేగింది.

చందంపేట :  సమితి మండలాధ్యక్షుడు లాలూనాయక్‌పై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దారి కాచి దాడి చేశారు. తీవ్ర గాయాలైన అతడిని  తరలిస్తుండగా మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోలేపల్లి స్టేజీ వద్ద బస్‌షెల్టర్‌ పక్కన కొందరు చిరు వ్యాపారులు  నిర్మాణాలు చేసుకొని ఉంటున్నారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  ఖాళీ చేయాలని ఆర్‌అండ్‌బీ, పోలీసు అధికారులు వారం రోజులుగా పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయినా వారు స్పందించకపోవడంతో అధికారులు శనివారం దుకాణాలను  అయితే.. అధికార పార్టీ నాయకుల కారణంగానే దుకాణాలు తొలగించారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌ కుమారుడు విజయ్‌ గ్రామంలో ప్రచారం చేశాడు. దీనిని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఖండించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని ఘర్షణకు దారి తీసింది.

పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. అనంతరం రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రమావత్‌ లాలూనాయక్‌ పోలేపల్లి నుంచి బిల్డింగ్‌తండాకు బైక్‌పై వెళ్తుండగా.. కాంగ్రెస్‌ పార్టీ వర్గీయులు దారి కాచి కర్రలతో దాడి చేయడంతో  గాయాలయ్యాయి.  లాలూనాయక్‌ కూతురు, చందంపేట జడ్పీటీసీ పవిత్రకు సైతం గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన లాలూనాయక్‌ను చికిత్స నిమిత్తం  తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రిపై దాడికి పాల్పడిన రమావత్‌ విజయ్‌, గోపాల్‌, మధులతోపాటు మరికొందరిపై జడ్పీటీసీ పవిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బిల్డింగ్‌తండాలో  వాతావరణం నెలకొనడంతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ  తెలిపారు.

టీఆర్‌ఎస్‌ నాయకుల పరామర్శ 

కాంగ్రెస్‌ పార్టీ నాయకుల దాడిలో  లాలూనాయక్‌  జడ్పీటీసీ పవిత్రను దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు, నాయకులు జాన్‌యాదవ్‌, బానావత్‌ పద్మహన్మనాయక్‌, తిరుపతయ్య, బిక్కునాయక్‌, మల్లేశ్‌ యాదవ్‌, బాలూనాయక్‌ పరామర్శించారు. 


logo