గురువారం 13 ఆగస్టు 2020
Suryapet - Jul 02, 2020 , 02:54:15

హైవేకు ఇరువైపులా మొక్కలు నాటాలి

హైవేకు ఇరువైపులా మొక్కలు నాటాలి

 కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

65 జాతీయ రహదారి వెంట హరితహారం పరిశీలన

సూర్యాపేట రూరల్‌ : 65వ జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా బుధవారం మండలంలోని టేకుమట్ల గ్రామం వద్ద రోడ్డుకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. అటవీశాఖ,  జీఎంఆర్‌, ఉపాధిహామీ అధికారులు కలిసి రోడ్డుకిరువైపులా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటాలని, చనిపోయిన వాటి స్థానంలో మరో మొక్కను నాటాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏపీడీ సురేశ్‌, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, అటవీశాఖ అధికారులు ప్రశాంతి, రాజునాయక్‌, సర్పంచ్‌ పిండిగ పద్మనాగేందర్‌, పంచాయతీ కార్యదర్శి అనిత పాల్గొన్నారు. 

వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలి

చివ్వెంల : జాతీయ రహదారి 65వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు మండలంలోని గుంజలూరు, జి.తిరుమలగిరి, గుంపుల, వల్లభాపురం, ఉండ్రుగొండ గ్రామాల్లో రోడ్డువెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీపీఓ యాదయ్య, డీఎఫ్‌ఓ ముకుందారెడ్డి, ఏపీడీ పెంటయ్య,  రాజునాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ గోపి, ఏపీఓ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు పల్లేటి నాగయ్య శైలజ, కంచర్ల నిర్మలాగోవిందరెడ్డి, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

మునగాల : మండలంలోని నరసింహాపురం నుంచి మాధవరం వరకు జాతీయ రహదారిపై మొక్కలు నాటేందుకు గుంతలు తీసే కార్యక్రమాన్ని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పరిశీలించారు. రెండున్నర మీటర్ల వ్యవధిలో మూడు వరుసల్లో మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ యాదయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ భూపాల్‌రెడ్డి, ఏపీఓ శేఖర్‌ తదితరులు ఉన్నారు.

కోదాడ రూరల్‌: మండల పరిధి నల్లబండగూడెం పాలే రువాగు సమీపంలో రాష్ట్ర సరిహద్దు తనిఖీకేంద్రాన్ని పరిశీలించారు. దొరకుంట, కోదాడ, కోమరబండ శివారులోని జాతీయ రహదారిపై నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. ఎంపీడీఓ ఆర్‌.భాస్కర్‌, ఎంపీఓ వి.సాంబిరెడ్డి, ఏపీఓ టానియా, కార్యదర్శి పోరళ్ల అరుణ, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. logo