శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Suryapet - Jul 02, 2020 , 02:54:35

ప్రభుత్వ భూములను గుర్తించాలి

ప్రభుత్వ భూములను గుర్తించాలి

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్లగొండ : జిల్లావ్యాప్తంగా రైతువేదికలు, పల్లెప్రగతి వనాలు, పట్టణ ప్రగతిలో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, జంతువధ శాలలు, పార్కులు, వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు, పబ్లిక్‌ టాయిలెట్లు, వ్యర్థాల శుద్ధికేంద్రం తదితర నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములను గుర్తించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు వి.చంద్రశేఖర్‌, రాహుల్‌శర్మలతో కలిసి పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం వాటిని కేటాయించాలని సూచించారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఆటోలు, జేసీబీ, డోజర్‌లు అవసరం మేరకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ చైర్మన్‌గా పలువురు అధికారులతో కొనుగోళ్ల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, లింగ్యానాయక్‌, రోహిత్‌, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాజ్‌కుమార్‌, వ్యవసాయశాఖ ఏడీ హుస్సేన్‌బాబు, సర్వే భూరికార్డుల ఏడీ శ్రీనివాసులు, మార్కెటింగ్‌ ఏడీ అలీం, తాసిల్దార్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


logo