శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Suryapet - Jul 02, 2020 , 02:54:55

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

 మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  పెరుమాళ్ల అన్నపూర్ణ 

బొడ్రాయిబజార్‌ : పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. బుధవారం పట్టణంలోని 33, 36వార్డుల్లో 6వ విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పి.రామానుజులరెడ్డి, కౌన్సిలర్లు గండూరి ప్రవళికాప్రకాశ్‌, కొండపల్లి భద్రమ్మాసాగర్‌రెడ్డి, నాయకులు వై.వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాశ్‌, ఉప్పల ఆనంద్‌, కరుణాకర్‌, నంద్యాల భిక్షంరెడ్డి, మీలా వంశీ తదితరులు పాల్గొన్నారు. 

హరిత తెలంగాణగా మార్చుకుందాం 

పెన్‌పహాడ్‌ : అందరం కలిసికట్టుగా రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చుకుందామని ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని దూపాడ్‌ శ్మశానవాటిక ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. అంతకుముందు గ్రామ పంచాయతీ ఎదుట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సమకూర్చిన చెత్తబుట్టల పంపిణీని ప్రారంభించారు. వైస్‌ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, ఎంపీడీఓ వేణుమాధవ్‌, సర్పంచ్‌ బిట్టు నాగేశ్వర్‌రావు, ఎగ్గడి మురళి, మామిడి అంజయ్య, మాజీ సర్పంచ్‌ భద్రయ్య, గుగ్గిళ్ల సోమయ్య, ఈసీ ఏకస్వామి, కార్యదర్శి జానయ్య తదితరులు పాల్గొన్నారు. 

 మొక్కలు ప్రాణకోటికి జీవనాధారం  

తిరుమలగిరి : మొక్కలు ప్రాణకోటికి జీవనాధారమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజిని అన్నారు. బుధవారం మున్సిపాలిటీలోని ఐదో వార్డులో ప్రజలకు  పండ్ల  మొక్కలను పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

హరితహారంపై కళాజాత 

తుంగతుర్తి :  జిల్లా కళాజాత బృందం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని కర్విరాల కొత్తగూడెంలోప్రజలకు హరితహారంపై అవగాహన కల్పించారు. కొత్తగూడెం సర్పంచ్‌ నకిరేకంటి విజయ్‌, కర్విరాల సర్పంచ్‌ వెలుగు వెంకన్న, కళాజాత బృందం సభ్యులు ఉపేందర్‌, భిక్షపతి, శ్రీకాంత్‌గౌడ్‌, మంజుల, నాగలక్ష్మి పాల్గొన్నారు. 

 అర్వపల్లి : హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పర్సాయపల్లి సర్పంచ్‌ పుప్పాల శేఖర్‌ పిలుపునిచ్చారు. బుధవారం 6వ విడుత హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటి మాట్లాడారు. ఎంపీటీసీ రాచకొండ గీత, ఉపసర్పంచ్‌ ధనుంజయ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కొప్పుల భరత్‌రెడ్డి, తోట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.logo