గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 02, 2020 , 02:55:01

నిరుపేద మహిళకు ఎస్పీ చేయూత

  నిరుపేద మహిళకు ఎస్పీ చేయూత

 అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి  పోలీసు పునరావాసం కింద ఆర్థిక సాయం

పెన్‌పహాడ్‌ : పేదరికంతో ఆర్థిక స్థోమత లేక సరైన వైద్యం చేయించుకోలేని ఓ మహిళకు  సూర్యాపేట ఎస్పీ భాస్కరన్‌ పోలీసు పునరావాసం కింద బుధవారం ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. మండలంలోని పొట్లపహాడ్‌ గ్రామానికి చెందిన షేక్‌. అమీనాబేగం కిడ్నీ వ్యాధితో   తీవ్ర అనారోగ్యానికి  గురైంది.  విషయం ఎస్పీ భాస్కరన్‌ దృష్టికి రావడంతో స్పందించిన ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు పునరావాసం కింద రూ.5వేల చెక్కును సూర్యాపేట రూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి  బాధితురాలికి అందజే శారు. ఈ సందర్భంగా  అమీ నాబేగం మాట్లాడుతూ..తన కుటుంబ పరిస్థితి తెలుసుకొని  ఆర్థిక సాయమందించిన ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఆరోగ్య  పరిస్థితి క్షీణించడం..ఇద్దరు అమ్మాయిలతో కుటుంబాన్ని సాకడం కష్టంగా ఉందని.. వైద్య ఖర్చులకు దాతలు ముందుకు వచ్చి  సహాయం అందించి ఆదుకోవాలని బాధితరాలు అమీనాబేగం వేడుకుంది. సీఐ వెంట ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఉన్నారు.  దాతలు (SBI-62422 262988, IFSC-SBIN0021537)నంబర్‌కు  సాయం చేయాలని కోరింది.logo